Search
Close this search box.

సంఘ నిబంధన

1. మేము దేవుని ద్వారా ఆయన మహిమ కొరకు సృష్టించబడి, పాపములో చనిపోయిన స్థితి నుంచి యేసుక్రీస్తు ప్రాయశ్చిత్త త్యాగమువలన జీవింపచేయబడి, నిత్యవారసత్వం పొందే వరకు పరిశుద్ధాత్మతో కట్టబడ్డాం. (కొలస్సీ1:16; ఎఫెసీ1:13-14, 2:5; 1 యోహాను2:2)

2. దేవుని వాక్యం ధ్యానించడానికీ, దేవుణ్ణి ఘనపరచడానికీ, కలిసి ప్రార్ధన చేయడానికీ, రొట్టె విరవడానికీ, ఒకరితో ఒకరు సహవాసం కలిగి ప్రోత్సహించుకోడానికి సంఘముగా కూడడాన్ని నిర్లక్ష్యంచేయం. (హెబ్రీ10:24,25; అ.కా2:42,46; ఎఫెసీ5:19 )

3. వినయంతో, సౌమ్యంగా, ఓపికకలిగి, ఒకరిని ఒకరు సహిస్తూ, ప్రేమతో క్షమించుకుంటూ, ఆత్మలో ఏకముగా ఉండడానికి ఆసక్తికలిగి, సంఘంతో పయనిస్తాం. (ఎఫెసీ4:1-3, 31,32, కొలస్సీ3:12-15 ) 

4. క్రీస్తు ప్రేమలో ఒకరిని ఒకరు జవాబుదారీగా ఉంచుతూ, పాపము వలన మేము కఠినపరచబడకుండా ఉండడానికీ, తోటి విశ్వాసుల ద్వారా ప్రోత్సహించబడడానికీ, సరిదిద్దబడడానికీ సిద్ధంగా ఉంటాం. (హెబ్రీ3:12-13; 1థెస్స 5:14; గలతి6:1 ) 

5. స్వార్ధపూరితమైన జీవితం జీవించకుండా, ఒకరి కొరకు ఒకరు ప్రార్ధిస్తూ, ఇతరుల సంతోషంలో పాలుపంచుకుంటూ, ప్రేమతో ఇతరుల దుఃఖాలను, భారాలనుభరిస్తాం. (ఎఫెసీ5:18-21, 6:18; రోమా12:15, 1పేతురు 4:9-10 )

6. సంతోషంగా, ధారాళంగా, క్రమంగా సంఘ పరిచర్యలకు సహాయం అందిస్తాం. (2 కొరింథీ8,9 )

7. మేము అందరం కలిసి సువార్తను ప్రకటిస్తూ, మా కుటుంబసభ్యుల, స్నేహితుల, బంధువుల, సహోద్యోగుల మరియు దేశ ప్రజల రక్షణకోరుకుంటాం. (మార్కు16:15; మత్తయి28:19-20 )

8. మేము దేవుని కృపద్వారా, పాపముతో నిండిన ఈ లోకములో జాగ్రత్తగా జీవించాలని కోరుకుంటూ, పరిశుద్ధంగా జీవించడానికి మమ్మల్ని మేము ఉపేక్షించుకుంటాం. దేవుని నామాన్ని మహిమపరచడానికి, సంఘం యొక్క సాక్ష్యాన్ని కాపాడడానికి మేము ఇలా చేస్తాం. (లూకా9:23; మత్తయి5:13-16; 1 కొరింథీ5:6; 2 తిమోతీ2:22; ఫిలిప్పీ2:12-13)

9. ఈ సంఘం నుంచి స్వచ్ఛందంగా బయటికి వెళ్లాల్సివస్తే, శాంతియుతంగా వెళ్తాం. అలాగే వీలైనంత త్వరగా ఈ నిబంధన స్ఫూర్తితో నడిపించబడే వాక్యాధారమైన సంఘంతో జతపరచబడతాం.

10. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రియైన దేవుని ప్రేమ, పరిశుద్దాత్మ దేవుని అన్యోన్య సహవాసం మన అందరితో కూడా సదాకాలం ఉండును గాక. ఆమేన్ (2 కొరింథీ13:14 )