దేవునిలో ఎదగడానికి, ఇతరులకు దేవుని గురించి తెలియచేయడానికీ సంఘంగా మేము దేవుని మీద ఆధారపడుతూ వివిధ పరిచర్యలు చేస్తూ ఉంటాము.
ఆదివారం సహవాసం
– పాటల ద్వారా దేవుని ఆరాధన – సువార్త ప్రకటన – సాక్ష్యం పంచుకోవడం – ప్రార్ధన – వివరణాత్మక ప్రసంగం – ప్రభువు బల్లలో పాలుపొందడం – సంఘ నిబంధన చదవడం – ప్రసంగంపై చర్చా కార్యక్రమం – సహవాస భోజనం
సంఘ ప్రార్ధన
3వ బుధవారం @ 07:30PM
ఉపవాస ప్రార్ధన: 1వ శనివారం 07:00 PM
బైబిల్ అధ్యయనం
1వ బుధవారం @ 06:00PM
స్త్రీ / పురుషుల సమావేశాలు
దేవుడు మనుషులందరినీ తన పోలికలోనే సృష్టించినా, పురుషులు మరియు మహిళలు భౌతిక, స్వాభావిక వ్యత్యాసాలు ఉన్నాయి, అందువల్ల వారి అవసరాలు మరియు పోరాటాలను విడివిడిగా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. సంఘంగా నెలకు ఒకసారి పురుషులు మరియు స్త్రీలకు వేర్వేరు సమావేశాలు ఉంటాయి. ఈ సమయంలో, ప్రార్థించడం, ప్రభువును ఆరాధించడం, వాక్యం నుండి నేర్చుకోవడం, ఒకరితో ఒకరు సాక్ష్యాలను పంచుకోవడం మరియు కలిసి సహపంక్తి భోజనం చేయడం కోసం విడివిడిగా సమావేశమవుతారు.
చర్చి క్యాంపు
సంఘ సభ్యులు ఒకరితో ఒకరు సహవాసం కలిగి సంబంధాలు కట్టుకోవడానికి అలాగే సంఘమంతా కలిసి దేవునికి మరింత దగ్గర అవ్వడానికి ప్రతీ సంవత్సరం 2-3 రోజులు ఏదైనా రిట్రీట్ సెంటర్ కి వెళ్లి సమావేశం అవుతాము.
సెమినార్లు
దేవుని వాక్యంలో ఒక సిద్ధాంతం మీద లేక ఒక అంశం మీద లోతైన అవగాహన కల్పించటానికి ఒక రోజు సెమినార్ నిర్వహిస్తాము.
ఇప్పటివరకు చేసిన సెమినార్లు
– వాక్యానుసారమైన కుటుంబం – పోర్నోగ్రఫీ నుండి విడుదల – బైబిల్ పరమైన పురుషత్వము, స్త్రీత్వము – క్రీస్తుని తెలుసుకోవడం – పరిశుద్ధ లేఖనాల శక్తి
ఇంటర్న్షిప్
సువార్త విస్తరణ ప్రాధమికంగా స్థానిక సంఘాల ద్వారా జరుగుతాది అని మేము నమ్ముతాము. ఆరోగ్యకరమైన స్థానిక సంఘాలు స్థాపించబడాలి అంటే దేవుని వాక్యాన్ని సరిగా అర్ధం చేసుకున్న సంఘ కాపరులు, నాయకులు కావలి. అలాంటి సంఘ కాపరులని, నాయకులని తయారు చెయ్యడానికి ఉద్దేశించిన పరిచర్య ఈ ఇంటర్న్షిప్.
సువార్త ప్రకటన
దేవుడు ఇచ్చిన గొప్ప ఆదేశం పాటించడానికి మేము ప్రయత్నిస్తాము. వ్యక్తిగతంగా, సంఘంగా సువార్త ప్రకటించడానికి, బంధుమిత్రులతో, పని చేసే చోట, మేము ఉండే ప్రాంతాలలో సువార్త ప్రకటించే ప్రయత్నం చేస్తూ ఉంటాము.
మాతో కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి, సహవాసం కలిగి ఉండడానికి, దేవుని సువార్తను ఇతరులకి పంచడానికి ఇష్టపడుతున్నారా?