సైద్ధాంతిక విశ్వాసాలు

పాత మరియు క్రొత్త నిబంధన పుస్తకాలు దేవుని మాట వలన స్పూర్తి పొంది, అసలు ప్రతులలో ఎటువంటి తప్పులు లేవని మేము విశ్వసిస్తాం. ఈ స్పూర్తి, లేఖనాలలో ప్రతి భాగానికి పూర్తిగా మరియు సమానంగా వర్తిస్తుందనీ, అదేవిధంగా అవి విశ్వాసి జీవితంలో అంతిమ అధికారం కలిగి ఉంటాయని మేము విశ్వసిస్తాం.

యోహాను 5:39, 17:8, 26:2; 2 తిమోతీ 3:16-17, 2 పేతురు 1:21

శాశ్వతంగా ముగ్గురు వ్యక్తులుగా ఉన్న త్రియేక దేవుణ్ణి మాత్రమే మేము నమ్ముతున్నాం. తండ్రి, కుమారుడు, పరిశుద్దాత్మ ముగ్గురు ఒకే స్వభావం, ఒకే గుణలక్షణాలు, ఒకే పరిపూర్ణత కలిగి, ఆరాధనకు, విధేయతకు సమాన యోగ్యత కలిగి ఉన్నారని మేము విశ్వసిస్తాం.

మత్తయి 28:19-20, యోహాను 1:1-4

యేసు క్రీస్తు ఒకే సమయంలో సంపూర్ణమైన దేవునిగా, సంపూర్ణమైన మానవునిగా ఉన్నాడని మేము విశ్వసిస్తాం. ఆయన తండ్రికి నిత్యవారసుడు, పరిశుద్దాత్మ వలన బలము పొందిన వాడు, కన్య మరియకు జన్మించాడు. యేసు క్రీస్తు నిష్కళంకమైన వాడనీ, మార్పు లేని వాడనీ, సమస్తానికీ సృష్టికర్త అనీ, అన్ని విషయాలలో ఆధిపత్యం కలిగినవాడనీ మేము విశ్వసిస్తాం.

కొలస్సీ 1:16,17, హెబ్రీ 4:15

ప్రభువైన యేసుక్రీస్తు మన పాపాలకు ప్రత్యామ్నాయ బలిగా మరణించాడనీ, మన పాపాల కోసం పూర్తిగా ప్రాయశ్చిత్తం చెల్లించాడని, అతని శిలువ వేయబడిన శరీరం మృతులలో నుండి లేపబడిందని మరియు మన ప్రధానయాజకునిగా, న్యాయవాదిగా, మధ్యవర్తిగా తండ్రి ముందు కనిపించడానికి పరలోకానికి ఆరోహణమయ్యాడని మేము నమ్ముతున్నాం.

1 తిమోతి 2:5; 1 పేతురు 1:18-20; 1 కొరింథీయులు 15:1-3; 1 థెస్సలొనీకయులు 4:13-18

పరిశుద్ధాత్మ తన కార్యాన్ని నెరవేరుస్తూ, దైవ లక్షణాలు కలిగిన సంపూర్ణమైన వ్యక్తి మరియు దేవుడు అని మేము విశ్వసిస్తాం.

యోహాను 14:16-17; 16:7-15; అపొస్తలుల 1:8; 1 కొరింథీ 6:19; ఎఫెసీ 2:22; 2 థెస్సలొనీక 2:7

మానవుడు దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాడని, ఉద్దేశపూర్వకంగా దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి, తద్వారా భౌతిక మరణం మాత్రమే కాకుండా ఆత్మీయ మరణం కూడా కలిగియున్నాడని, మనిషి యొక్క పతనమైన స్థితి కారణంగా నీతిమంతులు ఎవరూ లేరని మేము నమ్ముతున్నాం.

ఆ.కా 1:27; రోమా ​​​​3:10-12; 5:12-19; ​​యెషయా 64:6

సిలువపై తన రక్తాన్ని చిందించిన క్రీస్తుయేసు ద్వారా రక్షణ కార్యం పరిపూర్ణం అయిందని, మనిషి ద్వారా ఏది రక్షణ వైపు నడిపించలేదని మేము నమ్ముతున్నాం. రక్షణ కేవలం క్రీస్తులో విశ్వాసం ద్వారా, కృప వలన మాత్రమే అని మరియు నిజంగా రక్షించబడిన వారు మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలిస్తారని మేము నమ్ముతున్నాం.

యోహాను 1:12; 3:16; 14:6; అపొస్తలుల కార్యములు 4:12; రోమా ​​3:12,23; 2 పేతురు 1:3-11; ఎఫెసీ 1:3-4; 2:8-9; యోహాను 10: 28

మనిషి ఒక్కసారి మాత్రమే పుడతాడనీ అలాగే ఒకసారి మాత్రమే చనిపోతాడని ఆ తదుపరి తీర్పు మరియు నిత్యత్వాన్నీ ఎదుర్కొంటాడని మేము నమ్ముతున్నాం.

హెబ్రీ 9:27, 10:34; దానియేలు12:2-3; ప్రకటన 20:15

సంఘం అనేది యేసుక్రీస్తు యొక్క రక్షణాధారమైన కృపను నమ్మి, పరిశుద్ధాత్మ ద్వారా నూతన పరచబడి, క్రీస్తు శరీరంలో ఒకటిగా చేయబడి, దేవుని కుటుంబంగా ఏర్పరచబడిన వ్యక్తుల యొక్క కలయిక అని మేము నమ్ముతున్నాం.

ఎఫెసీ 2:19-20, 4:16; మార్కు 16:15-16

క్రీస్తు యేసు తన సంఘం కొరకు మళ్లీ వస్తున్నాడని కూడా మేము నమ్ముతున్నాం.